ఫైర్‌ ఫైటర్‌ బెలౌషికి ఇండియన్‌ మీడియా గ్రూప్‌ నివాళి

- September 03, 2016 , by Maagulf
ఫైర్‌ ఫైటర్‌ బెలౌషికి ఇండియన్‌ మీడియా గ్రూప్‌ నివాళి

ఆగస్ట్‌ 3న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో క్రాష్‌ ల్యాండ్‌ అయిన ఇకె 521 విమానం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఫైర్‌ ఫైటర్‌ జసెమ్‌ ఐసా బెలౌషికి ఇండియన్‌ మీడియా గ్రూప్‌ ఒకటి ఘన నివాళి అర్పించింది. గల్ఫ్‌ మాధ్యమం అనే మ్యాగజైన్‌ని, అలాగే మీడియా వన్‌ అనే ఛానల్‌ని నిర్వహిస్తున్న ఆ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు భారతీయులు, ఎమిరేటీలూ పాల్గొన్నారు. కేరళ మంత్రి విఎస్‌ సునీల్‌కుమార్‌, ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం తరఫున బలౌషి తండ్రి ఇసా అల్‌ బెలౌషికి మెమెంటోని అందించారు. రస్‌ అల్‌ఖైమా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఛైర్మన్‌ షేక్‌ సలీమ్‌ బిన్‌ సుల్తాన్‌ బిన్‌ సక్ర్‌ అల్‌ కాసిమి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పంపిన సందేశాన్ని ఈ సందర్భంగా చదివి వినిపించారు. ప్రమాద సమయంలో విమానంలో వున్న వారే కాకుండా, వారి కుటుంబాలు, అలాగే యావత్‌ భారతదేశం జసెమ్‌ త్యాగాల్ని ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. ఇదిలా ఉండగా, జసెమ్‌ అల్‌ బలౌషి త్యాగానికి గౌరవ సూచకంగా శుక్రవారం సక్ర్‌ హాస్పిటల్‌లో బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ని నిర్వహించారు. 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. జసెమ్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com