ప్రాణ స్నేహితుల కలయిక
- September 03, 2016
ఎప్పుడూ బిజీగా ఉండే చిరకాల స్నేహితులు ఒకింత తీరిక సుకుని...ఒకరినొకరు కలుసుకుంటే అది వారి జీవితాల్లో తీపిగుర్తులా మిగిలిపోతుంది. 'స్నేహబంధమూ ఎంత మధురమూ' అంటూ ఆప్యాయాతానురాగాలు కురిపించుకుంటాయి. మొదట ఆనందంతో మాటలు కరువైనా...ఆ తరువాత గత స్మృతులను నెమరువేసుకుంటూ తమదైన ప్రపంచంలో సర్వం మరిచిపోతారు. అలాంటి అనుభూతులనే 'పెదరాయుడు' మోహన్‌బాబు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పంచుకున్నారు. శనివారంనాడు చెన్నైలో తన మిత్రుడు రజనీకాంత్‌ను మోహన్‌బాబు కలుసుకుని విలువైన సమయాన్ని గడిపారు. ఆ అనుభూతులను ట్విటర్ ద్వారా మోహన్‌బాబు పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత నా మిత్రుడు రజనీకాంత్‌ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
ఆయన కింగ్‌లా ఉన్నారు. ఈ కలియుగంలో ఆయన దుర్యోధనుడయితే నేను కర్ణుడిని' అని మోహన్‌బాబు ఆ ట్వీట్లో తమ అనుబంధాన్ని చాటుకున్నారు. తామిద్దరూ కలుసుకున్న ఫోటోతో పాటు రజనీకాంత్ సతీమణి లత తన చేతికి రాఖీ కడుతున్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. 'చాలాకాలం తర్వాత నా సోదరి లతను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
రజనీకాంత్ విజయం వెనుక ఆయన సతీమణి లత ఉందని నేను బలంగా నమ్ముతున్నాను' అంటూ రజనీదంపతులపై ఆప్యాయతానురాగాలు కురిపించారు కలెక్షన్ కింగ్.
తాజా వార్తలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు







