సినీ పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా జయప్రద
- September 03, 2016
ఉత్తర్‌ప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా నియమితులైన సినీనటి జయప్రద తొలిసారిగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆమెకు అభిమానులు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఉత్తర్‌ప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్పర్సన్ గానియమించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ములాయంసింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఙతలు తెలిపారు. సాహితీవేత్త నీరజ్‌ను చైర్మన్‌గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో తోడ్పడతానని చెప్పారు.
బొంబాయి హాలీహుడ్ మాదిరిగా యూపీ సినీ పరిశ్రమను తీర్చిదిద్దుతానన్నారు. తెలుగు, తమిళ సినీ అభిమానులు తనను ఎంతో కాలంగా ఆదరిస్తున్నారని, టాలీవుడ్, కోలీవుడ్ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషిచేస్తానని జయప్రద తెలిపారు. అనంతరం ఆమెను అభిమానులు పూలమాలలు శాలువాలతో సన్మానించారు.
తాజా వార్తలు
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి







