గౌతమ్‌ దర్శకత్వం లో 'రజనీ'

- September 03, 2016 , by Maagulf
గౌతమ్‌ దర్శకత్వం లో 'రజనీ'

గౌతమ్‌ మేనన్‌. ఓ ట్రెండ్ సెట్టర్. ప్రేమ కధలు, పోలీసు కధలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు. హీరోల ఇమేజ్ తో సంబధం లేకుండా తను అనుకున్న కధనే చెబుతుంటాడాయన. అందుకే చాలా మంది హీరోలో వైవిధ్యం కోసం ఆయన్ని కోరుకుంటారు. ఇప్పటికే కమల్ హసన్ , సూర్య , అజిత్ లాంటి బడా స్టార్స్ తో సినిమాలు చేసేశారు గౌతం. ఇప్పుడాయన సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఓ కధ చెప్పారని తెలిసింది.

ప్రస్తుతం ధనుష్‌ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు గౌతమ్‌. అదే సమయంలో ధనుష్‌కి మరో కథ వినిపించారట. ఐతే ఇది మావయ్య రజనీకి బాగుంటుందని ధనుష్‌ భావించడం, వెంటనే రజనీకి ఈ కథ గురించి చెప్పడం జరిగిపోయిందని తెలిసింది. రజనీకీ ఈ కధ నచ్చిందట.

ప్రస్తుతం 'రోబో 2'చేస్తున్నారు రజనీ. ఈ సినిమా తర్వాత పా రంజిత్ తో మరో సినిమా అనుకున్నారు. ఇప్పుడు గౌతమ్‌ మేనన్‌ కూడా వచ్చి చేరారు. మరి ఈ రెండిట్లో ఏ సినిమా మొదట సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com