'మహేష్' సినిమా ఏప్రిల్ లో విడుదలకు సన్నాహాలు
- September 03, 2016
ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 30శాతంపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ సామాజిక కథాంశం నేపథ్యంలో రూపొందుతోంది. ఈనెలనుండి చెన్నైలో షూటింగ్ జరగనుంది. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తిచేసి ఆ తరువాత మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా తరువాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తాడని తెలిసింది.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







