చేప పులావ్
- September 03, 2016
కావలసినవి : రెండు కప్పుల సన్న బియ్యం, సరిపడినంత ఉప్పు రెండు టీస్పూన్ల పంచదార, ఒక బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క, మూడు యాలకులు, రెండు లవంగాలు, మూడు టేబుల్‌స్పూన్ల నెయ్యి, 300 గ్రాముల బోన్‌లెస్ చికెన్, నాలుగు టేబుల్‌స్పూన్ల మైదా పిండి, చేప ముక్కలు వేగించడానికి సరిపడా నూనె.
ఎలా చేయాలి
చేప ముక్కలపై ఉప్పు చ ల్లి మైదా పిండిని రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముక్కలపై మైదా అతుక్కుంటుంది. నూనె వేడిచేసి చేప ముక్కలను మరీ కరకరలాడేట్టు కాకుండా బ్రౌన్ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత నెయ్యి వేడిచేసి మసాలా దినుసులు వేసి చిటపటమనే వరకు ఉంచి బియ్యం వేసి మరో నాలుగు నిముషాలు వేగించాలి. దీనిలో పంచదార, నాలుగు కపల నీళ్లు, ఉప్పు కలపాలి. సెగను మరీ ఎక్కువ, తక్కువ కాకుండా పెట్టండి. మూతపెట్టి అన్నం ఉడికే వరకు ఉంచాలి.
దీనిలో వేగించిన చేప ముక్కలను వేసి జాగ్రత్తగా కలపాలి. మళ్లీ మూతపెట్టి సెగ తగ్గించి ఏడు నిముషాల పాటు ఉడికించాలి. దీన్ని బూందీ రైతాతో తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







