ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా మద్దతు
- September 04, 2016
న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్‌లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా నుంచి మద్దతు లభించింది. చైనాలో జీ20 సదస్సుకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ భారత ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ఆస్ట్రేలియా గతంలోనే భారత్ సభ్యత్వానికి మద్దతు తెలిపింది. దీనిని మాల్కం మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
ఇరువురు నేతలు సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఇరు ప్రాంతాల్లో భద్రతాపరమైన సమస్యలు పరిష్కారానికి ప్రయత్నించారు. దీంతోపాటు ఇరు పక్షాలు పరస్పరం రక్షణ, భద్రతా పరమైన అంశాలపై సహకరించుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవటానికి ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







