హైదరాబాద్ లో 'ప్రవాసి స్త్రీశక్తి' అవార్డుల విలేఖరుల సమావేశం
- September 04, 2016
తేది: 04.09.2016 న ఎన్ఎస్ఎస్ హైదరాబాద్ లో విలేఖరుల సమావేశం జరిగింది
'ప్రవాసి బతుకమ్మ' పండుగ - 'ప్రవాసి స్త్రీశక్తి' అవార్డులు
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు 'ప్రవాసి మిత్ర' పత్రికతో కలిసి హైదరాబాద్ లో ఆదివారం నాడు 2 అక్టోబర్ 2016న 'ప్రవాసి బతు కమ్మ'
జరుపనున్నాము. ఈ పండగ ద్వారా విదేశాలలోని మన విశిష్ట మహిళలను సన్మానించి సత్కరించదలిచాము. ఈ కార్యక్రమంలో10 మంది ప్రవాసి భారతీయ మహిళలు, భారత సంతతి మహిళలకు 'ప్రవాసి స్త్రీశక్తి' అవార్డు అందచేయడం జరుగుతుంది.
దేశంకాని దేశంలో వారి పోటీతత్వం, నైపుణ్యం, సామాజిక అంశాలలో వారు చూపిన చతురత, సామర్ద్యం వీటితో పాటు మానవతా దృక్పథంతో అభివృద్ధికి సంక్షేమానికి వారు అందించిన సేవల ఘనత గమనార్హం. ప్రవాస భారతీయ మహిళ, భారత సంతతి మహిళలలు భారత దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారైనా ఈ పురస్కారానికి అర్హురాలే ! కుల, మత, ప్రాంతీయ, వంశ, ఐశ్వర్య మరియు నమ్మకాలు ఈ పురస్కారానికి సత్కారానికి అడ్డుగోడలు కాకూడదని నిర్ణయించాం . భారతీయ మహిళ ప్రపంచంలో ఏమూలలో ఉన్నా ఆమె ఔన్నత్యాన్ని, సామర్ధ్యాన్ని, సామాజిక దృక్పదాన్ని, మానవాళికి వారు అందించిన సేవలు కనుగొన్న నూతన వినూత్న విషయాలని వెలికి తీసి గౌరవించడమే మహిళా సాధికారతను గౌరవించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
ఆయా రంగాలు: చట్టము, వైద్యము, ఆరోగ్యము, స్వయం ఉపాది, సామాజిక / సంఘ సేవా కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థ రంగము, కార్మిక సంఘము, పనిమనుషుల సంక్షేమం మరియు హక్కులు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య, సామాజిక శాస్త్రము మరియు విజ్ఞానము, ఆత్మార్త విషయములు, కళాత్మక కార్యకలాపాలు, క్రీడా రంగము ఇలా మానవాతా దృక్పధంతో ఉన్న అన్నిరంగాలలోను శాంతికి ప్రగతికి కష్టపడి తమ సేవలు అందించిన వారికి ఈ పురస్కారం కలదు.
ఇతివృత్తం: బతుకమ్మ పండగ ప్రజలను కలిపే సాంస్కృతిక సంబరం ! శాంతికి ప్రగతికి ఇది నిరంతరం విలేఖరుల సమావేశంలో పాల్గొన్నవారు:
రామచంద్రా రెడ్డి బాణాపురం, ఓవర్సీస్ కోఆర్డినేటర్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్; మంద భీంరెడ్డి, ఎడిటర్, ప్రవాసి మిత్ర; ప్రొ.విమల కటికనేని; గ్రెస్ రాజకుమారి; రాఘవేంద్ర; కెఎస్ రామ్; సరితా నాయుడు; మిథిలా రెడ్డి (ఖతార్ ఎన్నారై); జంధ్యాల వెంకట పద్మజ (దుబాయి ఎన్నారై)
- - - -- - - - - - - - - - - - - - - - -



తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







