అన్నం బోండాలు

- September 05, 2016 , by Maagulf
అన్నం బోండాలు

కావలసినవి: నాలుగు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, రెండు టీస్పూన్ల పంచదార, ఒక టీస్పూను ఉప్పు సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, రెండు టేబుల్‌ స్పూన్ల సోయా సాస్‌, ఒక టీస్పూను చిల్లీ సాస్‌, ఒక టేబుల్‌ స్పూను వెనిగర్‌, సన్నగా తరిగిన కొత్తిమీర గుప్పెడు, రెండుకప్పుల అన్నం (ఫోర్క్‌తో లేదా పొటాటో మాషర్‌తో అన్నాన్ని చిదమాలి), ముప్పావు కప్పు పల్లీ పప్పుల ముక్కలు, నూనె.

తయారీ:

అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పంచదార, పచ్చిమిరపలను మిక్సీ పట్టి ఈ మిశ్రమానికి సోయా, చిల్లీ సాస్‌లు, వెనిగర్‌, కొత్తిమీర కలపాలి. దీనంతటినీ చిదిమిన అన్నానికి కలపాలి. చేతులకి కొద్దిగా నూనె రాసుకుని అన్నం మిశ్రమాన్ని 18-20 భాగాలుగా చిన్న ఉండలుగా చేయాలి.
పల్లీ గింజల పప్పులను ఒక ప్లేట్‌లో చల్లి ఒక్కో ఉండను పల్లీగింజలు బాగా అంటుకునేవరకు దొర్లించాలి. కళాయిలో నూనెను వేడిచేసి అన్నం ఉండల్ని బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. ఈ ఉండల్ని టిష్యూ పేపర్‌ మీద వేస్తే నూనె పీల్చుకుని తరువాత కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఇవి ఇరవైమందికి సరిపోతాయి. తయారీకి 30 నిముషాలు పడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com