ప్రిన్స్ మహేష్ బాబు దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు..
- September 06, 2016
ప్రిన్స్ మహేష్ బాబు దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. అదేంటీ.. ఇన్నాళ్లు మహేష్ హైదరాబాద్ లో లేడా.. ? నిజంగానే ఇక్కడ లేరు. ప్రస్తుతం మహేష్ మురగదాస్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం.. చెన్నై షెడ్యూల్ రేపటి (సెప్టెంబర్ 7) నుంచి చెన్నైలో జరగనుంది.హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత దొరికిన ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేశాడు ప్రిన్స్. తనయుడు గౌతమ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని కూడా అక్కడే కానిచ్చిన మహేష్.. నిన్న సాయంత్రం తిరిగి హైద్రాబాద్ చేరుకున్నారు.ఇక, రేపటి నుంచి మళ్లీ రంగంలోకి దిగనున్నాడు మహేష్. బుధవారం నుంచి ప్రారంభం కానున్న చెన్నై షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జై రాజ్.ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







