కేథరిన్ ట్రెసా లక్కీ ఛాన్స్ కొట్టేసింది
- September 06, 2016
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150'. తొలుత ఈ మూవీ టైటిల్ పై ఎంతో కసరత్తు జరిగింది. కత్తిలాంటోడు అని కొన్ని రోజులు మూవీ యూనిట్ ప్రచారం కూడా చేసినా.. చివర్లో 'ఖైదీ నెం.150'కి ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో చిరు సరసన నయనతార, అనుష్క అని ప్రచారం జరిగినా చివరికి 'చందమామ' కాజల్ అగర్వాల్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం దర్శకుడు వి.వి.వినాయక్ దక్షిణాది హీరోయిన్ కేథరిన్ ట్రెసాను సంప్రదించగా ఆమె ఒకే చెప్పేసింది. చిరుతో కలిసి స్టెప్పులు వేసే అవకాశాన్నిఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది.మెగాస్టార్ మూవీ అనగానే దాదాపు మూడు నెలల కిందటే కేథరిన్ ఈ మూవీలో సాంగ్ కోసం సంతకం చేసిందట. తాజాగా ఈ విషయాన్ని మూవీ యూనిట్ వారు వెల్లడించారు. అయితే ఈ సాంగ్ ఇంకా షూట్ చేయలేదట. తమిళ మూవీ ఒరిజినల్ 'కత్తి' లో ఈ పాట లేదని సమాచారం. తమిళ కత్తి రీమేక్ అయినప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ కోసం మూవీ యూనిట్ చిన్న చిన్న మార్పులు చేస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిరు, కేథరిన్ లపై సాంగ్స్ చిత్రీకరణ జరగనుందన్న వార్త ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్. చిరుకు ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వి.వి.వినాయక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహిరస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







