రామోజీ ఫిల్మ్‌సిటీలో 'ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్'
- September 06, 2016
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈనెల 24 నుంచి ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ జరగనుంది. కార్నివాల్ వివరాలను సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కార్నివాల్లో 20వేల మంది అతిథులు పాల్గొంటారని, 200 చిత్రాలు, వెయ్యి లఘుచిత్రాలు ప్రదర్శిస్తారని తెలిపారు. రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. 50 నుంచి 100 ఎకరాల్లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్నివాల్లో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు పాల్గొంటారని ఏరిస్ కంపెనీ సీఈవో సోహన్‌రాయ్ తెలిపారు.
అతిపెద్ద భారత చలనచిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







