రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫిల్మ్ కార్నివాల్..
- September 06, 2016
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈనెల 24 నుంచి ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ జరగనుంది. కార్నివాల్ వివరాలను సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కార్నివాల్లో 20వేల మంది అతిథులు పాల్గొంటారని, 200 చిత్రాలు, వెయ్యి లఘుచిత్రాలు ప్రదర్శిస్తారని తెలిపారు. రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. 50 నుంచి 100 ఎకరాల్లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్నివాల్లో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు పాల్గొంటారని ఏరిస్ కంపెనీ సీఈవో సోహన్‌రాయ్ తెలిపారు.అతిపెద్ద భారత చలనచిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







