సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో
- September 06, 2016
సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని ఇటీవల గుసగుసలు వినిపించాయి. నయనతార, విజయ్ సేతుపతి జంటగా విఘ్నేష్ దర్శకత్వంలో విడుదలైన 'నేనూ రౌడీనే' చిత్రం నచ్చి సూర్య ఆయన దర్శకత్వంలో నటించాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. అయితే వీటిని నిజం చేస్తూ.. దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశారు. సూర్యతో సినిమా తీయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి, స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు అందిస్తున్నట్లు తెలిపారు. దీన్ని సూర్య రీట్వీట్ చేస్తూ.. గుర్తుండిపోయే చిత్రాన్ని తీద్దామన్నారు.సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'సింగం-3' చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రంలో అనుష్క, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







