ఎయిర్ ఏషియా డిస్కౌంట్ సేల్ ..
- September 06, 2016
బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. ముందస్తు బుకింగ్‌లపై అన్ని ఛార్జీలు కలిపి రూ. 599 ప్రారంభ ధరతో విమాన టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 11 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 2017, ఫిబ్రవరి 6 నుంచి 2017 అక్టోబర్ 28 మధ్య ఎయిర్‌ఏషియా దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.దీని ప్రకారం.. గువాహటి-ఇంఫాల్‌కు అన్ని ఛార్జీలు కలిపి విమాన టికెట్ ధర రూ.599గా ఉంది. అంతేగాక, బెంగళూరు నుంచి కోచికి రూ. 899, గోవాకు రూ. 1,099, విశాఖపట్నానికి రూ.1,199, దిల్లీకి రూ. 2,299, పుణెకు రూ. 1,299గా టికెట్ ధరలు ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి కూడా ముందస్తు టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది ఎయిర్‌ఏషియా.ఆఫర్ కింద కోచి నుంచి కౌలాలంపూర్‌కు టికెట్ ధర రూ. 3,399గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లను కేటాయించబోతోందన్న విషయాన్ని మాత్రం ఎయిర్‌ఏషియా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







