మొక్కజొన్న హల్వా
- September 07, 2016
కావలసిన పదార్థాలు: రిఫైన్డ మొక్కజొన్న పిండి(కార్న్‌ఫ్లోర్)- 1/2 కప్పు, పంచదార- ఒకటిన్నర కప్పు, నీళ్ళు- రెండున్నర కప్పులు, నెయ్యి- 1 టేబుల్ స్పూను, వేగించిన జీడిపప్పు ముక్కలు- 2 టీ స్పూన్లు, యాలకుల పొడి- 1/2 టీ స్పూను, మిఠాయి రంగు- చిటికెడు.
తయారీ విధానం: నాన్ స్టిక్ బాణలిలో ఒక కప్పు నీళ్ళు, పంచదార వేసి తీగపాకం రానివ్వాలి. తరువాత కార్న్‌ఫ్లోర్‌లో ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాకంలో పోసి బాగా కలిపి, సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి వేసి, మిఠాయి రంగును స్పూనుడు నీళ్ళలో కలిపి పోసి, గరిటెతో కలుపుతూ ఉడికించాలి. పదార్థం బాణలి అంచులను వదులుతూ గరిటెకు చుట్టుకుపోతున్నప్పుడు మంట కట్టేసి, నెయ్యి రాసిన ప్లేటులోనికి తీసుకుని చల్లార్చి ముక్కలు కోయాలి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







