పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు ..
- September 08, 2016
ఒక దేశం నుంచి మన దేశాలకు వ్యాపిస్తున్న ఉగ్రవాదమే మనందరి ప్రధాన సమస్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లావోస్ రాజధాని వియంటియాన్‌లో జరుగుతున్న 14వ ఆసియాన్- ఇండియా సదస్సులో గురువారం ప్రధాని మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.'ఉగ్రవాదం, ఉగ్ర భావజాలం, హింస ఇతర దేశాలకు వ్యాపించేలా చేస్తున్నారు' అని పాక్‌నుద్దేశించి మోదీ అన్నారు. దీనిపై కలిసికట్టుగా సమష్టి కృషి చేయాలని ఆసియాన్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. .ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీపై పోరాడేందుకు భారత్ చర్యలు తీసుకోవాలని భావిస్తోందని, దీనికి ఆసియాన్ దేశాలు కూడా మద్దతివ్వాలని కోరారు.ప్రధాని మోదీ పాక్‌పై వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఇటీవల చైనాలో జరిగిన జీ20 సదస్సులోనూ మోదీ.. పాక్ వైఖరిపై పరోక్షంగా స్పందించారు. దక్షిణాసియాలోని ఓ దేశం ఉగ్రవాదాన్ని పెంపొదిస్తోందని మోదీ ఆ సమయంలో చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







