'ఫిదా' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి
- September 08, 2016
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫిదా' చిత్రం నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరో వరుణ్‌తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తొలి షెడ్యూల్ పూర్తయినట్లు అభిమానులకు తెలిపారు. బాన్స్‌వాడ షూటింగ్ చాలా సరదాగా జరిగిందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నామని పేర్కొంటూ.. కథానాయిక సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. త్వరలో కలుద్దాం అని ట్వీట్ చేశారు.దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తర్వాతి షూటింగ్ షెడ్యూల్ అమెరికాలో జరగనున్నట్లు తెలుస్తోంది.అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి ఒకరినొకరు ఎలా ఇష్టపడ్డారన్న నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







