నింగికెగసిన మన మరో రాకెట్!

- September 08, 2016 , by Maagulf
నింగికెగసిన మన మరో రాకెట్!

 నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి శాస్త్రవేత్తలు జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-05ని గురువారం సాయంత్రం ప్రయోగించారు. రాకెట్‌ నింగిలోకి దూసుకువెళ్లింది. ఇన్‌శాట్‌ 3 డీఆర్‌ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ ఎస్‌05 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూ పొందించిన క్రయోజనిక్‌ ఇంజన్‌తో నాల్గవ సారి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 రాకెట్‌ ప్రయోగించింది. ఈ రాకెట్‌ ద్వారా దేశ వాతావరణ సమగ్ర సమాచారాన్ని తెలిపే 2211 కిలోల ఇన్‌శాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com