*నువ్వొస్తే .......*
- September 08, 2016
మనసు విప్పి ఆరేసుకున్నాక
నువ్వు కురిసి వెళ్ళిపోతావు
ఎప్పటిలా తడిసిపోతుంటాను
చిరునవ్వుకు ఒలికి పోతుంటాను
చెలీ ...
వేటాడుతున్నావో
వెంటాడుతున్నావో
ఏదీ.....అర్థం కాదు,
నా నీడ మాత్రం అచ్చం నీలాగే వుంది
వెన్నెల వాకిట్లకు నన్నెందుకు తరిమావో
పైరగాలి ఎందుకు వీచిందో
పవిట కొంగు ఎందుకు ఊగిందో
సిగ్గంతా వొలకబోసుకున్న సింగారం
కౌగిట్లో ఎలా కరిగి పోయిందో...
ఏమని చెప్పేది ఆమనిలా నువ్వొస్తే
చీకటంతా గొంగళి పురుగులా కనులలోకి పారింది
కలలన్నీ సీతాకోక చిలుకలై ఎగురుతున్నాయి
తేనె తాగిన చిట్టి చీమలు
తీయగా కుట్టి వెళ్లినట్టు తెలియనే లేదు
*పారువెల్ల*
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







