గొడ్డలితో దొంగతనానికి పాల్పడుతున్న యువకుడి అరెస్ట్‌

- September 09, 2016 , by Maagulf
గొడ్డలితో దొంగతనానికి పాల్పడుతున్న యువకుడి అరెస్ట్‌

మనామా: బహ్రెయినీ విద్యార్థి ఒకరు గొడ్డలితో ఓ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడేందుకు యత్నిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. బహ్రెయినీ వ్యక్తి ఇంట్లోకి చొరబడిన ఆ యువకుడు, ఆ ఇంటి యజమానిని గొడ్డలితో బెదిరించి, ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు యత్నించాడు. అయితే, ఇంటి యజమాని జాగ్రత్తగా ఆ యువకుడ్ని అదుపుచేయగలిగారు. పోలీసులు వచ్చేలోపు ఆ యువకుడ్ని నిర్బంధించి, పోలీసులకు అప్పగించారు ఇంటి యజమాని. నిందితుడికి సహాయంగా వచ్చిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాల్ని చేతబూనిన కేసుతోపాటు, ఆయుధంతో ఓ వ్యక్తిని బెదిరించిన కేసుని నిందితుడిపై ఛార్జ్‌ చేశారు. విచారణలో పోలీసులు అతనిపై 11 దొంగతనాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు గుర్తించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com