షార్జా పోలీసుల కొత్త అస్త్రం: స్పైడర్‌ గన్‌

- September 09, 2016 , by Maagulf
షార్జా పోలీసుల కొత్త అస్త్రం: స్పైడర్‌ గన్‌



షార్జా: షార్జా పోలీసులు అక్రమంగా గుమికూడే జన సమూహాన్ని కంట్రోల్‌ చేయడాన్నీ, క్రిమినల్స్‌ని అదుపు చేయడానికీ కొత్త ఆయుధాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరే 'స్పైడర్‌ గన్‌'. షార్జా పోలీస్‌ డిప్యూటీ చీఫ్‌ కల్నల్‌ అబ్దుల్లా ముబారక్‌ బిన్‌ అమెర్‌ ఈ స్పైడర్‌ గన్‌ వివరాల్ని సీనియర్‌ పోలీస్‌ అధికారుల వెల్లడించారు. స్పైడర్‌ గన్‌, క్యాచింగ్‌ నెట్స్‌ ఆధారంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. సమూహాల్లోకి చొరబడి విధ్వంసాలు సృష్టించేవారిని ఈ స్పైడర్‌ గన్‌ ద్వారా అదుపు చేస్తారు. అయితే ఈ స్పైడర్‌ గన్‌ వల్ల ఎవరికీ ఎలాంటి మానీ ఉండదని చెప్పారాయన. నేరాల్ని అదుపు చేయడంలో, ఆందోళనల తీవ్రతను తగ్గించడంలో పోలీసుల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ కొత్త అస్త్రం ఉపయోగపడ్తుందని అన్నారు కల్నల్‌ అబ్దుల్లా ముబారక్‌. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com