గొడ్డలితో దొంగతనానికి పాల్పడుతున్న యువకుడి అరెస్ట్
- September 09, 2016
మనామా: బహ్రెయినీ విద్యార్థి ఒకరు గొడ్డలితో ఓ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడేందుకు యత్నిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బహ్రెయినీ వ్యక్తి ఇంట్లోకి చొరబడిన ఆ యువకుడు, ఆ ఇంటి యజమానిని గొడ్డలితో బెదిరించి, ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు యత్నించాడు. అయితే, ఇంటి యజమాని జాగ్రత్తగా ఆ యువకుడ్ని అదుపుచేయగలిగారు. పోలీసులు వచ్చేలోపు ఆ యువకుడ్ని నిర్బంధించి, పోలీసులకు అప్పగించారు ఇంటి యజమాని. నిందితుడికి సహాయంగా వచ్చిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాల్ని చేతబూనిన కేసుతోపాటు, ఆయుధంతో ఓ వ్యక్తిని బెదిరించిన కేసుని నిందితుడిపై ఛార్జ్ చేశారు. విచారణలో పోలీసులు అతనిపై 11 దొంగతనాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







