తోక రహస్యం
- August 05, 2015
పూర్వం జంతువులకు మనుషుల్లాగే తోకలు ఉండేవి కాదు. అడవికి రాజైన సింహం మేం మనుషులతో సమానంగా ఉండాలా? లేదు మాకు మనుషుల కన్నా ప్రత్యేతక ఉండాలి అని హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసింది. దాంతో పరమ శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మనుషుల కన్నా మేం ఎక్కువ కాబట్టి మాకు మనుషులకి తేడా కనిపించేలా ఏదైనా ఒక వరం ఇమ్మని కోరింది. అందుకు పరమశివుడు ఒక నవ్వు నవ్వి, అవును మీకు తోకలుంటే బావుంటుంది అని ఒక పేద్ద తోకల చుట్ట ఇచ్చి ఎవరికెంత తోకలు కావాలో తీసుకుని తిరిగిమ్మని చెప్పి మాయమైపోయాడు. సింహం ఆ తోకల చుట్ట పట్టుకుని అడవికి వచ్చి, దేవుణ్ణి అడిగి ఈ తోకల చుట్ట తెచ్చాను. తోకలు కావాలిసిన వారు పౌర్ణమి నాడు నా వద్దకు రండి అని ఎలుగుబంటి చేత దండోరా వేయించింది. పౌర్ణమి నాడు జంతువులన్నీ తోకల కోసం ఎంతో సంతోషంగా సింహం దగ్గరికి వచ్చాయి. అదే అడవిలో ఒక సోమరిపోతు ఏనుగు ఉండేది. దానికి చాలా బద్దకం ఎక్కువ. తన పని తాను చేసుకోకుండా ఎవరో ఒకరికి అప్పగిస్తూ ఉంటుంది. అలాగే ఈ పనిని ఒక టక్కరి కోతిక అప్పగించి నీతో పాటు నాకు కూడా ఒక తోక తీసుకురా అంది. సింహం కోతి చెట్ల మీద అటూ ఇటూ తిరుగుతుంది కదా దానికి తోక పెద్దగా ఉంటే కష్టంగా ఉంటుంది కదా అని చిన్న తోక, ఏనుగుది భారీ శరీరం కదా అని పెద్దతోక ఇచ్చి పంపింది. ఈ పంపకం కోతికి నచ్చక ఆ రెండు తోకలూ తానే అతికించేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఏనుగు లబోదిబోమనుకుంటూ సింహం దగ్గరకు వెళ్లగా సింహం దాని బద్దకానికి నాలుగు చివాట్లు పెట్టి తన దగ్గర మిగిలిన చిన్న తోక ముక్కా ఇచ్చి పంపించింది అలా కోతికి పెద్దతోకా, ఏనుగుకు చిన్నతోకా వచ్చాయట.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







