50 దిర్హామ్‌లతో ఇల్లు, అరకిలో బంగారం గెల్చుకోవచ్చు

- September 10, 2016 , by Maagulf
50 దిర్హామ్‌లతో ఇల్లు, అరకిలో బంగారం గెల్చుకోవచ్చు

అజ్మన్‌లోని గ్రాండ్‌ మార్ట్‌ హైపర్‌ మార్కెట్‌లో షాపింగ్‌ చేసేవారికి అద్భుతమైన బహుమతుల్ని పొందే అవకాశం ఉంది. 50 దిర్హామ్‌లు అంతకన్నా ఎక్కువ మొత్తంలో షాపింగ్‌ చేసేవారికి ఈ బహుమతులు పొందే అవకాశం కలగనుంది. అర కిలో బంగారం, దుబాయ్‌లో ఓ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ, ఆరు టయోటా కరోల్లాస్‌ కార్లు వంటివి ఈ బహుమతుల్లో ఉన్నాయి. సెప్టెంబర్‌ 8 నుంచి ఆరు నెలలపాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఖతార్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్రాండ్‌ మార్ట్‌ గ్రూప్‌ కంపెనీస్‌ ఈ మెగా ప్రమోషన్‌ ఆఫర్‌ని ప్రకటించింది. ఇది వినియోగదారుల జీవితాన్ని మార్చే ఆఫర్‌ అని సంస్థ ప్రతినిథులు తెలిపారు. టయోటా కరోలా కార్లకు సంబంధించి తొలి డ్రా అక్టోబర్‌ 2న జరుగుతుంది. ప్రతి నెలా ఒక్కో కారు చొప్పున ఐదు కార్లను గెలుచుకునే అవకాశం వినియోగదారులకు ఉంటుంది. మెగా ప్రైజ్‌గా దుబాయ్‌లో సొంత ఇల్లు, అలాగే అర కిలో గోల్డ్‌కి సంబంధించిన ్డసరా మార్చ్‌ 17న జరుగుతుంది. అజ్మన్‌లోని నాజిర్‌ ప్లాజా అల్‌ మొవైహాత్‌2లో గ్రాండ్‌ మార్ట్‌ హైపర్‌ మార్కెట్‌ ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com