పొడవైన బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ నెట్‌వర్క్‌ను పూర్తి చేసిన చైనా
- September 10, 2016
ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ నెట్‌వర్క్‌ను చైనా పూర్తి చేసింది. చైనా హై-స్పీడ్ రైల్వే 20వేల కిలోమీటర్ల పొడవైన ట్రాక్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి ఈ ఘనత సాధించింది. అత్యంత వేగవంతమైన రైళ్లలో భారత్ సహా ప్రపంచ దేశాలకు పోటీగా ఉండడానికి చైనా ఈ ట్రాక్స్‌ను ఏర్పాటు చేసింది. హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్జోహు నుంచి జియాంగ్సు ప్రావిన్స్‌లోని జుజోహు వరకు ఏర్పాటు చేసిన ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే మార్గాన్ని చైనా ఈరోజు ప్రారంభించింది.
ఈ రైల్వే లైను నిర్మాణం 2012 డిసెంబరులో ప్రారంభం కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించడం ప్రారంభించారు.
ఈ లైను ద్వారా జియాన్ నుంచి షాంఘై నగరానికి ప్రయాణ కాలం 11 గంటల నుంచి ఆరు గంటలకు తగ్గుతుంది. భారత్‌లో బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ డీల్ సొంతం చేసుకోవడానికి చైనా జపాన్‌తో పోటీ పడుతోంది. ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య హైస్పీడ్ రైలు కాంట్రాక్ట్ జపాన్‌కు దక్కింది. చెన్నై-దిల్లీ మధ్య బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చైనా అధ్యయనం చేస్తోంది.
తాజా వార్తలు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!







