త్వరలో విడుదల కానున్న 'ఉపేంద్ర 2' ఆడియో
- August 05, 2015
కన్నడ స్టార్ ఉపేంద్రకు టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. 'ఎ', 'రా', 'ఉపేంద్ర' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ఉపేంద్ర ఇటీవల అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడాయన మళ్లీ 'ఉపేంద్ర 2' ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం 'ఉపేంద్ర' చిత్రానికి సీక్వెల్. కన్నడ వెర్షన్ కి 'ఉప్పి 2' టైటిల్ ఖరారు చేయగా, తెలుగు వెర్షన్ కి 'ఉపేంద్ర 2' టైటిల్ ని ఖరారు చేసారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు రచయిత కూడా ఉపేంద్రే. 'గాలిపటం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన క్రిస్టీనా అకీవా ఈ చిత్రంలో కథానాయికగా నటించగా.. పరుల్ యాదవ్ మరో కథానాయికగా నటించింది. ఈ వారంలోనే ఆడియోను విడుదల చేసి, ఈ నెలలోనే సినిమాని విడుదల చేయడానికి నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సన్నాహాలు చేస్తున్నారు. ఉపేంద్ర-2 మూవీ స్టిల్స్ కోసం క్లిక్ చెయ్యండి....
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







