పొడవైన బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్స్‌ నెట్‌వర్క్‌ను పూర్తి చేసిన చైనా

- September 10, 2016 , by Maagulf
పొడవైన బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్స్‌ నెట్‌వర్క్‌ను పూర్తి చేసిన చైనా

ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్స్‌ నెట్‌వర్క్‌ను చైనా పూర్తి చేసింది. చైనా హై-స్పీడ్‌ రైల్వే 20వేల కిలోమీటర్ల పొడవైన ట్రాక్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి ఈ ఘనత సాధించింది. అత్యంత వేగవంతమైన రైళ్లలో భారత్‌ సహా ప్రపంచ దేశాలకు పోటీగా ఉండడానికి చైనా ఈ ట్రాక్స్‌ను ఏర్పాటు చేసింది. హెనాన్‌ ప్రావిన్స్‌లోని జెంగ్‌జోహు నుంచి జియాంగ్సు ప్రావిన్స్‌లోని జుజోహు వరకు ఏర్పాటు చేసిన ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే మార్గాన్ని చైనా ఈరోజు ప్రారంభించింది.
ఈ రైల్వే లైను నిర్మాణం 2012 డిసెంబరులో ప్రారంభం కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించడం ప్రారంభించారు.

ఈ లైను ద్వారా జియాన్‌ నుంచి షాంఘై నగరానికి ప్రయాణ కాలం 11 గంటల నుంచి ఆరు గంటలకు తగ్గుతుంది. భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ నెట్‌వర్క్‌ డీల్‌ సొంతం చేసుకోవడానికి చైనా జపాన్‌తో పోటీ పడుతోంది. ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య హైస్పీడ్‌ రైలు కాంట్రాక్ట్‌ జపాన్‌కు దక్కింది. చెన్నై-దిల్లీ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చైనా అధ్యయనం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com