దాన వీర శూర కర్ణ స్వాతంత్ర సమరం..!!

- August 05, 2015 , by Maagulf
దాన వీర శూర కర్ణ స్వాతంత్ర సమరం..!!

శ్రీ సాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ పతాకాలపై జె.వి.ఆర్. దర్శకత్వంలో నందమూరి జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం 'దానవీర శూరకర్ణ'. జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావులు నిర్మాతలు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాతలు తెలియజేస్తూ, బాలరామాయణం తరువాత అందరూ బాలనటులతో రూపొందిన చిత్రమిది. దివంగత జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా, రెండో తనయుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా అద్భుతమైన నటనను కనబరిచి తాతకు తగ్గ మనవళ్లుగా నిలిచారు. సినిమా కోసం నటీనటులందరికీ మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చామని, దర్శకుడు జె.వి.ఆర్. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, పాటలు, గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ చిత్రాన్ని ఈనెల 15న విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com