బహరేన్ లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి పలువురికి గాయాలు
- September 11, 2016
మనామా: షేక్ జాబెర్ అల్ సబా హైవే, షేక్ ఇసా బిన్ సల్మాన్ రహదారిపై జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒక బహ్రేయినీ వ్యక్తి మరణించగా మరియు పలువురు గాయపడ్డారు. సిత్ర ప్రాంతం లోని అల్ ఖర్జియా గ్రామంకు చెందిన 18 ఏళ్ల ఆలీ అల్ నక్కల్ అనే యువకుడు మరణించజినట్లుగా గుర్తించారు. అంతర్గత మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ పేజీలో " షేక్ జాబెర్ అల్ సబా హైవే మీద రిఫ్ఫా దిశలో ఒక కారు మరియు ఒక ట్రక్ పాల్గొన్న ఒక తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదంలో ఒక బహ్రేయినీ పౌరుడు మరణించాడు" అని ఉదయం ప్రకటించింది.సంబంధిత అధికారుల అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పునరుద్ఘాటించారు. రద్దీగా ఉన్న హైవే మీద ట్రాఫిక్ లో ఒక కారు ట్రక్ ని బలంగా ఢీ కొట్టిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు . దీనిపై మరిన్ని పరిశోధనలను జరుపుతున్న సంబంధిత అధికారుల ద్వారా ప్రమాదం యొక్క వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే , సాయంత్రం 7 గంటల సమయంలో షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే మీద రెండవ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రజలు పలు గాయాల పాలయ్యారు.ఈ రెండు ప్రమాదాలకు ముఖ్య కారణం రెండు రహదారులపై నెలకొని ఉన్న భారీ ట్రాఫిక్ స్ధితేనని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







