పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది..
- September 11, 2016
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది. కాకినాడలో పవన్ చేసిన ప్రసంగం తమ సెంటిమెంట్లను గాయపరిచిందని ఆరోపిస్తూ కొందరు లాయర్లు హైదరాబాద్ నాంపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి తన గెడ్డం గీసుకున్నంత తేలికగా కేంద్రం 2014 లో తెలంగాణాను వేరు చేసిందని పవన్ వ్యాఖ్యానించాడని, ఇది రెచ్చగొట్టే స్టేట్ మెంట్ అని వారు విమర్శించారు.
రాష్ట్ర విభజన జరిగాక మనో వేదనతో తాను 11 రోజులు ఆహారం తీసుకోలేదని పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య కలతలు రేపి వివాదాలు సృష్టించేవిగా ఉన్నాయని అన్నారు. కాగా పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకున్నప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







