విదేశాల్లో నూ పతంజలి స్టోర్స్.!

- September 11, 2016 , by Maagulf
విదేశాల్లో నూ పతంజలి స్టోర్స్.!

ఇప్పటికే దేశంలో శరవేగంగా మార్కెట్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న పతంజలి సంస్థ ఇప్పుడు విదేశాల్లోను వ్యాపారానికి సిద్ధమవుతోంది. ఆ సంస్థకు చెందిన ఉత్పత్తులు విదేశాల్లో కూడా విక్రయించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రొడక్ట్స్ యజమాని, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చెప్పారు. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్ లో తమ వ్యాపార సంస్థల ఏర్పాటుకు, మధ్యాసియాలో ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశామన్నారు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లో కూడా అడుగుపెడతామని రాందేవ్ తెలిపారు. సౌదీ అరేబియాలో కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లో మాత్రం రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తామన్నారు. 90శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్ బైజాన్ లోనూ తమ ఉత్పత్తులు విక్రయిస్తున్నామని, అక్కడి వ్యాపార వేత్తలు కూడా వాటిని బాగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, పతంజలి గార్మెంట్స్ రంగంలో కూడా అడుగుపెట్టి విదేశాల్లో స్వదేశీ జీన్స్ పేరిట విక్రయిస్తామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com