ప్రముఖ గాయని తొలిసారిగా ఓ షార్ట్‌ఫిల్మ్‌..

- September 11, 2016 , by Maagulf
ప్రముఖ గాయని తొలిసారిగా ఓ షార్ట్‌ఫిల్మ్‌..

ప్రముఖ గాయని తొలిసారిగా ఓ షార్ట్‌ఫిల్మ్‌ చేశారు.. రాగం పేరుతో తెరకెక్కిన ఈచిత్రం తన వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటుంది అని చెప్పారామె. ఆ షార్ట్‌ఫిల్మ్‌లో తమె చేసినది ప్రవల్లిక జర్నలిస్టు పాత్ర అయితే.. సింగర్‌ లైఫ్‌కి దగ్గరగా ఎలా అనే క్యూరియాసిటీ సహజం.. అందుకే ఆ వివరాలను కూడ డిటైల్డ్‌గా చెప్పారు.
'అసలు నేనే యాక్టింగ్‌కి సరిపోనని నా ఉద్దేశ్యం.. అందుకే సినిమాల్లో పలు ఆఫర్లు వచ్చినా ఎపుడూ ఒప్పుకోలేదు.. కానీ రాగం ఫిల్మ్‌ిలో ఎవరిపైనా ఆధారపడని మహిళపాత్ర పోషిస్తున్నా.. వృత్తిరీత్యా జర్నలిస్టు అయినా.. పాడటం అంటే ఆపాత్రకు చాలా ఇష్టం.. వర్క్‌ప్లేస్సుల్లో ప్రతిరోజు మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలను ఇది డీల్‌ చేస్తుంది..

ఎంతో మందికి ఆలోచనలకు రేకెత్తించే కాన్సెప్ట్‌ ఇది.. అన్న సునీత.. ఈమూవీకి ఎక్కువ మంది మహిళలే పనిచేయటాన్ని గుర్తుచేశారు.. ముఖ్యంగా చైతన్యకు అవకాశం ఇవ్వటంలో తన ఉద్దేశ్యం కూడ ప్రోత్సహించటమే అని చెప్పారు సునీత.

ఉన్న ఫీల్డ్‌లో చాలా సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.. మనసులో ఎన్ని భావాలు ఉన్నా ముఖంపై చిరునవ్వును కంటిన్యూ చేయాలి.. రాగం కూడ ఇలాంటి క్యారెక్టరే.. నా రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉండటంతోనే చాలా సీన్స్‌ను సింగిల్‌ టేక్‌లో చేయగలిగా అంటున్నారు సింగర్‌ కం యాక్టర్‌ సునీత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com