ఉ.కొరియా వరదలు : 133మంది మృతి, 395 మంది గల్లంతు...

- September 12, 2016 , by Maagulf
ఉ.కొరియా వరదలు : 133మంది మృతి, 395 మంది గల్లంతు...

ఉత్తరకొరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భారీస్థాయిలో వరదలు సంభవించాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 133 మంది మృతిచెందగా.. మరో 395 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యాంగ్‌యాంగ్‌ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐరాస ఈ వివరాలను ప్రకటించింది. ట్యుమెన్‌ నదీ పరీవాహక ప్రాంతంలో లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రాంతాల్లో సహాయచర్యలు చేపట్టినట్లు దేశ అధికారిక మీడియా పేర్కొంది. 35వేల ఇళ్లు, 8,700 ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com