యువ నటుడు ధనుష్ హాలీవుడ్ ప్రవేశానికి రంగం సిద్ధం..
- September 12, 2016
యువ నటుడు ధనుష్ హాలీవుడ్ ప్రవేశానికి రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. ఈయన ఒక ఆంగ్ల చిత్రంలో నటించనున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుందన్న సమాచారం లేదు. ధనుష్ ప్రస్తుతం తమిళ చిత్రాలలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నారు. ఆయన నటించిన తొడరి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న తెరపైకి రానుంది. ఆ వెంటనే కొడి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రంలో నటిస్తున్నారు.మరో పక్క మెగాఫోన్ పట్టి రాజ్‌కిరణ్ కథానాయకుడిగా పవర్ పాండి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.a
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







