రియల్ లైఫ్‌లో ప్రత్యర్థులుగా సీనియర్ నటులు...

- September 12, 2016 , by Maagulf
రియల్ లైఫ్‌లో ప్రత్యర్థులుగా  సీనియర్ నటులు...

 ఇద్దరు నటులు రైవల్స్‌గా మారిపోయారు. దీనికి నడిగర్‌ సంఘం వేదికైంది. ఆ సొసైటీలో కోటిన్నర రూపాయల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆ సంఘం మాజీ అధ్యక్షుడు, నటుడు శరతకుమార్‌పై హైకోర్టుకి ఎక్కాడు ఆ సంఘం అధ్యక్షుడు నాజర్. 9 ఏళ్ల కాలంలో శరత్ కుమార్, రాధారవితోపాటు మరోవ్యక్తిపై కూడా నిధులను దుర్వినియోగం చేశారని అందులో ప్రస్తావించారు. మార్చి 3న సిటీ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందులో ప్రస్తావించాడు నాజర్‌. ఈ పిటిషన్ త్వరలో న్యాయస్థానం ముందుకు విచారణకు రానుంది.నిధుల దుర్వినియోగంపై న్యాయస్థానం విచారణకు ఆదేశిస్తే శరత్‌కుమార్‌కు చిక్కులు తప్పదంటూ కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.ఈ వివాదం ఇప్పటిదికాదని అంటున్నారు. ఇటీవల జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికల నుంచి నిధుల దుర్వినియోగంపై శరత్‌కుమార్.. నాజర్ వర్గాలపై మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. గడిచిన కొన్నేళ్లుగా నడిగర్ సంఘం అధ్యక్షుడిగావున్న శరత్‌కుమార్, ఈసారి ఘోరంగా ఓలమిపాలైయ్యాడు.దీంలో ఆ సంఘంలోని లోపాలను ప్రత్యర్థి వర్గం కదుపుతోంది. మొత్తానికి రీల్ లైఫ్ ఏమోగానీ.. రియల్ లైఫ్‌లో ప్రత్యర్థులుగా మారిపోయారు ఈ సీనియర్ నటులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com