స్కిల్డ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్‌కు ఆస్ట్రేలియా ముఖ్యమైన మార్పులు..
- September 12, 2016
స్కిల్డ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్‌కు ఆస్ట్రేలియా ముఖ్యమైన మార్పులు చేసింది. ఆస్ట్రేలియా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అదనంగా 5 పాయింట్లు ఇస్తోంది. ఈ నెల 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో డాక్టరేట్ లెవెల్, మాస్టర్స్ లెవెల్ రీసెర్చ్ క్వాలిఫికేషన్లు ఉన్న విద్యార్థులకు ఈ అదనపు పాయింట్లు ఇస్తోంది. అత్యుత్తమ, గొప్ప తెలివైన నైపుణ్యంగలవారిని ఆస్ట్రేలియా వైపు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఎంటర్‌ప్రెన్యూవర్ వీసా బిజినెస్ ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా కొత్త ఎంటర్‌ప్రెన్యూవర్ వీసా కోసం దరఖాస్తులను అనుమతిస్తున్నారు.
2 లక్షల డాలర్ల థర్డ్ పార్టీ ఫండింగ్‌తో ఎంటర్ప్రెన్యూవర్లకు ఇది ఉపయోగపడుతుంది. వీరు తమ సృజనాత్మక ఆలోచనలతో ఆస్ట్రేలియాలో వ్యాపారం చేయవచ్చు. ఈ వీసా ఆస్ట్రేలియాలో పర్మినెంట్ రెసిడెన్సీకి కూడా బాటలు వేస్తుంది. ఎంటర్‌ప్రెన్యూవర్ వీసా పొందడానికి అర్హతలు ఏమిటంటే...
అభ్యర్థి వయసు 55 ఏళ్ళ లోపు ఉండాలి.
ఇంగ్లిష్‌లో కాంపిటెంట్ లెవెల్ పరిజ్ఞానం ఉండాలి.
ఆస్ట్రేలియాలో ఎంటర్ప్రెన్యూవరియల్ వెంచర్‌ను అభివృద్ధి చేయడానికి కనీసం 2 లక్షల డాలర్ల అగ్రిమెంట్ కలిగియుండాలి.
ఈ ఎంటర్ప్రెన్యూరియల్ వెంచర్లో కనీసం 30 శాతం ప్రయోజనాన్ని కలిగియుండాలి.
అభ్యర్థిని స్టేట్ లేదా టెర్రిటరీ గవర్నమెంట్ నామినేట్ చేయాలి.
కామన్వెల్త్ ఏజెన్సీలు, స్టేట్, టెర్రిటరీ గవర్నమెంట్, రీసెర్చ్ ఆర్గనైజేషన్లు, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తుదారులు ఫండింగ్ పొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ







