భారత సంతతికి 'యంగ్‌ ప్రొఫెషనల్‌' పురస్కారం..

- September 12, 2016 , by Maagulf
భారత సంతతికి 'యంగ్‌ ప్రొఫెషనల్‌' పురస్కారం..

భారత సంతతికి చెందిన నలుగురు పారిశ్రామికవేత్తలతోపాటు మరో ముగ్గురు అమెరికన్లకు ఈ ఏడాదికిగాను 'యంగ్‌ ప్రొఫెషనల్‌ ఆఫ్‌ ద ఇయర్‌'పురస్కారం దక్కింది. భారత్‌-అమెరికాల మధ్య బంధాలను బలోపేతం చేయడంలో తమవంతు పాత్ర పోషించినందుకు, పారిశ్రామిక రంగంలో విశేష ప్రతిభ కనబర్చినందుకు ఈ పురస్కారంతో గౌరవిస్తున్నామని ఇండో అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హూస్టన్‌ ప్రకటించింది.

ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో మలిషా పటేల్, రేవతి పింకు, భావేశ్‌ పటేల్, అబ్జార్‌ ఎస్‌ తయాబ్‌జీలున్నారు. వీరితోపాటు మార్విన్‌ ఓడమ్, రిచర్డ్‌ హబ్నర్, డాక్టర్‌ జాన్‌ మెండెల్సన్‌లకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం దక్కింది.

హూస్టన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి దాదాపుగా 70 మంది ప్రముఖలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... భారత్‌తో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడమంటే ఓ రకంగా ప్రపంచంతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడమేనని, భవిష్యత్తులో ఇటువంటివారిని ప్రోత్సహించేందుకే ఈ పురస్కారాలను అందజేస్తున్నామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com