భారత సంతతికి 'యంగ్ ప్రొఫెషనల్' పురస్కారం..
- September 12, 2016
భారత సంతతికి చెందిన నలుగురు పారిశ్రామికవేత్తలతోపాటు మరో ముగ్గురు అమెరికన్లకు ఈ ఏడాదికిగాను 'యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్'పురస్కారం దక్కింది. భారత్-అమెరికాల మధ్య బంధాలను బలోపేతం చేయడంలో తమవంతు పాత్ర పోషించినందుకు, పారిశ్రామిక రంగంలో విశేష ప్రతిభ కనబర్చినందుకు ఈ పురస్కారంతో గౌరవిస్తున్నామని ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ ప్రకటించింది.
ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో మలిషా పటేల్, రేవతి పింకు, భావేశ్ పటేల్, అబ్జార్ ఎస్ తయాబ్జీలున్నారు. వీరితోపాటు మార్విన్ ఓడమ్, రిచర్డ్ హబ్నర్, డాక్టర్ జాన్ మెండెల్సన్‌లకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం దక్కింది.
హూస్టన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి దాదాపుగా 70 మంది ప్రముఖలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... భారత్‌తో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడమంటే ఓ రకంగా ప్రపంచంతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడమేనని, భవిష్యత్తులో ఇటువంటివారిని ప్రోత్సహించేందుకే ఈ పురస్కారాలను అందజేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!







