హాజిస్ కొరకు నునుపైన ట్రాఫిక్ ప్రవాహం కొనసాగించాలని మక్కా గవర్నర్ పిలుపు
- September 12, 2016
రియాడ్: ప్రస్తుత హజ్ సీజన్లో మినా నుంచి అరాఫత్ మీదుగా వచ్చే భక్తుల రాక ఒక అపూర్వమైన ఉద్యమం మాదిరిగా ఉందని మక్కా గవర్నర్ యువరాజు ఖలేద్ అల్-ఫైసల్ వర్ణించారు.యువరాజు ఖలేద్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ తమ రాజ్యంలో హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు నాణ్యమైన సేవలు అందించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ చర్యలు తమ శత్రువులకు ఇది అసూయని కల్గిస్తుందని ఆయన అన్నారు. హజ్ సీజన్లో మక్కా మరియు పవిత్ర స్థలాల సందర్శన కోసం కోసం ఒక సమగ్ర ప్రణాళిక అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రణాళికలో భాగంగా యాత్రికుల ముంజేయకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్లు ధరింపచేయడం ద్వారా మక్కా పవిత్ర నగరమని ఒక స్మార్ట్ నగరంగా మార్చబడిందని ఆయన అన్నారు.యాత్రికుల ప్రవాహాన్ని మరియు ట్రాఫిక్ అవరోధాలని నియంత్రించడానికి ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల ద్వారా నాయకత్వ నిర్దేశకాలను ఏర్పరచి మరియు ఒక స్మార్ట్ నగరంకు తగినట్లుగా ఒక యోగ్యమైన విధానం ఈ అమలులో ఉందని ఆయన తెలిపారు. హాజ్ యాత్రకు వచ్చిన వారికి సంపూర్ణ అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ఇస్లాం మతంలో అతి ప్రాముఖ్యమైన నియమం హజ్ సందర్శన అని భౌతికంగా మరియు ఆర్థికంగా ఉన్నవారు తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే హాజ్ యాత్రకు వస్తారు కనుక వారి ఎటువంటి లోటు పాట్లు లేకుండా అని సౌకర్యాలు సమకూర్చాలని ఆయన ఆజ్ఞాపించారు.మక్కాని సందర్శించే అక్రమ యాత్రికులు సంఖ్య 5 శాతంకు పడిపోయిందిని తెలియచేస్తూ వరుసగా 1436 మరియు 1435 పుణ్యక్షేత్రం సీజన్లలో 70 శాతంతో పోల్చితే, 9 శాతంకు ప్రస్తుతం పడిపోయిందని తెలిపారు. పైన పేర్కొన్న నియమ నిబంధనలను ఉల్లంఘించినవారిపై విషయంలో కఠినంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







