అక్టోబర్ 7న 'ఈడు గోల్డ్ ఎహే' ..
- September 13, 2016
డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ - "ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. అతి త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, అక్టోబర్ 7న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం.క్లాస్‌ని, మాస్‌ని అలరించే ఈ చిత్రం ఆడియన్స్‌ని థ్రిల్ చేసే ఎంటర్టైనర్గా రూపొందింది. సునీల్ కెరీర్‌కి, మా బేనర్‌కి 'ఈడు గోల్డ్ ఎహే' మరో సూపర్‌హిట్ చిత్రమవుతుంది" అన్నారు. డాన్సింగ్ స్టార్ సునీల్ సరసన సుష్మారాజ్, రిచా పనయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్ ఇస్సార్, డా|| నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రభాస్, భరత్, అనంత్, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్ అక్షిత్, నల్లవేణు, గిరిధర్, సుదర్శన్, విజయ్, జోష్ రవి, పి.డి.రాజు, పవన్, గణేష్, కోటేశ్వరరావు, జగన్, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్, సంగీతం: సాగర్ ఎం. శర్మ, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఫైట్స్: గణేష్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







