'పద్మ' అవార్డుల విజేతల వివరాలతో వెబ్‌సైట్‌..

- September 13, 2016 , by Maagulf
'పద్మ' అవార్డుల విజేతల వివరాలతో వెబ్‌సైట్‌..

'పద్మ' అవార్డులు ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు ఎవరెవరికి, ఎప్పుడు, ఏ ప్రాతిపదికన అవార్డులిచ్చారో అన్న సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు www.padma awards.gov.in పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. 1954 నుంచి 2016 వరకు పద్మ అవార్డు స్వీకర్తల వివరాలు ఇందులో పెట్టనున్నారు. దీని ద్వారా పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ గురించి, అవార్డు గ్రహీతల గురించి అందరూ తెలుసునేందుకు వీలవుతుందని అధికారులు తెలిపారు. కాగా, పద్మ అవార్డుల ఎంపికలో లాబీయింగ్‌కు చోటులేకుండా.. పారదర్శకత కోసం ప్రజల అభిప్రాయాలూ స్వీకరిస్తున్నారు. ఈసారి పద్మ అవార్డుల కోసం ఇప్పటికే 1700 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.దరఖాస్తులకు గడువు ఈ నెల 15తో ముగియనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com