ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కునేవారికి ఓ హెచ్చరిక..!
- September 13, 2016
తరచూ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కునేవారు కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ట్రాఫిక్ జామ్‌లో వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము వంటి విషవాయువుల కారణంగా కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లో ఉన్న సమయంలో కారులో ఉన్నవారు తలుపులు మూసివేయడంతో పాటు లోపల ఫ్యాన్లు కూడా ఆపేయాలని, తరచూ హెడ్‌లైట్లు ఆర్పడం, వేయడం వంటివి చేయకూడదని వారు సూచిస్తున్నారు. కారు ఆగిఉన్న సమయంలో రహదారుల మీద దుమ్ము, పొగ ఫ్యాన్‌లోకి ప్రవేశించి వారి శరీరంలోకి చొరబడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌లో హారన్ల రొద కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతాయని వారు గుర్తు చేస్తున్నారు.సాధ్యమైనంత వరకూ వాహన కాలుష్యం నుంచి తప్పించుకోగలిగితే కేన్సర్ ముప్పు తగ్గుతుందని వారు వివరించారు. అయితే ట్రాఫిక్ జామ్ వల్ల ఆరోగ్య నష్టం పాదచారుల మరింత ఎక్కువగా ఉంటుందని మరొక పరిశోధనలో వెల్లడైంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







