నా అదృష్టం: మోహన్‌బాబు

- September 14, 2016 , by Maagulf
నా అదృష్టం: మోహన్‌బాబు

టి.సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న మున్సిపల్‌ స్టేడియంలో మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో సినీ నటుడు మోహన్‌బాబుకు నవరస నట తిలకం బిరుదు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, శ్రీదేవి, జయసుధ, పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారని సుబ్బిరామిరెడ్డి తెలపారు. దీనిపై స్పందించిన మోహన్‌బాబు తనకు ఈ బిరుదు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రపంచం తరలి రానుండడం తన అదృష్టమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా 16, 17 తేదీల్లో సీఎస్‌ఆర్‌ లలితకళా పరిషత్‌ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com