సౌక్ వకిఫ్‌లో ఆకట్టుకుంటున్న కల్చరల్ ఈవెంట్స్
- September 14, 2016
ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్‌లో భాగంగా అహ్మద్ స్క్వేర్ - సౌక్ వకిఫ్‌లో జరుగుతున్న కల్చరల్ ఈవెంట్స్ ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈద్ తొలి రోజున ప్రారంభమైన ఈ ఈవెంట్స్ శుక్రవారం వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 నిమిషాల వరకు ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. జిసిసి దేశాల నుంచి కూడా ఈ సెలబ్రేషన్స్‌ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు విచ్చేస్తుండడంతో ప్రాంగణమంతా కొత్త కళు సంతరించుకుంది. సంప్రదాయ అరబ్ కల్చర్‌ని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. ఈ ఈవెంట్‌లో పలు సంప్రదాయ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. సంప్రదాయ అరబిక్ పాటలు, మరియు నృత్యాలతో ఆహూతులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకో వైపున సమీపంలోని రెస్టారెంట్స్ నిత్యం రద్దీగా మారిపోతున్నాయి వినియోగదారులతో. ఖతార్ టూరిజం అథారిటీ సహకారంతో ఈ కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







