క్రేన్ క్రాష్ ఘటన బాధితులకు స్పెషల్ 'హజ్'
- September 14, 2016
మక్కా గ్రాండ్ మాస్క్‌లో గత ఏడాది జరిగిన క్రేన్ క్రాష్ ఘటనలో తీవ్ర గాయాల పాలై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి, ఈ ఏడాది హజ్ ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వారిలో ట్యునీషియాకి చెందిన యూసుఫ్ అనే వ్యక్తి, తనకు కల్పించిన హజ్ సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వైద్య ఖర్చులు భరించడంతోపాటుగా, హజ్ యాత్ర నిర్వహించేందుకుగాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సౌకర్యం ఉన్న అంబులెన్స్‌ని ఏర్పాటు చేశారని తెలిపాడాయన. హజ్ యాత్ర సందర్భంగా పూర్తిస్థాయిలో వైద్య సహాయం తనకు అందిందని వివరించారు యూసుఫ్. గత ఏడాది గ్రాండ్ మాస్క్‌లో జరిగిన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ షాక్‌కి గురిచేసింది. అయితే ఆనాటి ఘటన పట్ల ఆందోళన కొంత ఉన్నా, హజ్ యాత్రకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో యాత్రీకులు వచ్చి ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







