బ్యాగేజ్ డిలేతో ఒమన్ ఎయిర్ కేరళ ప్రయాణీకుల వెతలు
- September 14, 2016
మస్కట్: మస్కట్ నుంచి కేరళలోని కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ప్రయాణీకులకు వారి బ్యాగేజీ అందక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి చింతిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్న ఒమన్ ఎయిర్ వర్గాలు, వీలైనంత త్వరగా వారి లగేజ్‌ని వారికి అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. లాంగ్ వీకెండ్ రావడంతో ఒమన్ ఎయిర్‌కి సంబంధించిన విమానాలన్నీ ఫుల్ అవుతున్నాయి. దాంతో, ఆపరేషనల్ సమస్యలు తలెత్తి లగేజ్ డిలే ఏర్పడిందని అధికారిక వర్గాలు ధీవీకరించాయి. సోమవారం వచ్చిన విమానంలో 70 మంది ప్రయాణీకులకు మంగళవారం బ్యాగేజ్లు అందగా, మరికొందరు ఇంకా తమ బ్యాగేజీల కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఈద్ అల్ అదా మరియు ఓనమ్ సందర్భంగా ప్రయాణీకులకు వరుస సెలవులు వచ్చాయి. దాంతో, అన్ని విమానాలూ ఫుల్ ప్యాక్డ్గా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇన్ని రోజులు సెలవులు రావడం ఇదే మొదటిసారి. మొత్తం 9 రోజులపాటు ఒమన్‌లో ఉంటున్నవారికి సెలవులు వచ్చాయి. దాంతో సొంత ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులతో అన్ని విమానాలూ కిటకిటలాడుతున్నట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







