యూఏఈలో ఓనమ్ షాపింగ్
- September 14, 2016
అబుదాబీ: యూఏఈలోని మలయాళీలంతా ఓనమ్ ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నారు. కలర్స్ ఫ్యాషన్ ట్రేడింగ్ షాప్‌లో ఓనమ్ సందర్భంగా అవసరమైన దుస్తులను ఇక్కడ విక్రయిస్తున్నారు. అలాగే ఓనమ్‌కి సంబంధించిన అన్నీ ఇక్కడ లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేశారు. మూడేళ్ళుగా కాదర్ అతని పార్టనర్ రాయ్ వర్గీస్ - అబుదాబీలో ఇండియన్ ట్రెడిషనల్ దుస్తుల్ని, సంప్రదాయ బద్ధంగా వారికి కావాల్సిన వివిధ వస్తువల్ని విక్రయిస్తున్నారు. ఇండియన్ స్కూల్స్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయనీ, వాటి కోసం తమ షాప్‌లో అన్నీ అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. పలు దుకాణాల్లోంచి ఇదివరకు వీటిని సేకరించేవారనీ, తాము అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచామని వారు వివరించారు. ఓనమ్ కోసం ప్రత్యేకంగా వినియోగించే పామ్ లీవ్స్‌తో తయారు చేసిన అంబ్రెల్లాస్, వుడెన్ చెప్పల్స్, క్రౌన్స్ ఫర్ మహాబలి, క్రీమ్ శారీస్ విత్ గోల్డెన్ బోర్డర్స్ మరియు ఇమిటేషన్ జ్యుయెలరీని ఓనమ్ సందర్భంగా అందుబాటులో ఉంచారు. ఈ సంప్రదాయ దుస్తుల్ని స్టిచ్ చేసి ఇవ్వడంతోపాటు, అద్దెకు కూడా ఇస్తామన్నారు. టైగర్ డాన్స్ (పులికాలి) కోసం ఓనమ్ సందర్భంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







