హైదరాబాద్‌లో భారీ వర్షం
- September 15, 2016
భాగ్యనగరంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. అయితే గురువారం వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య జీహెచ్ఎంసీ పరిధిలో భారీవర్షం కురిసింది. గంట వ్యవధిలో 9.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం.గురువారం మధ్యాహ్నం నగరంలోని పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. అనంతరం చినుకులుగా ప్రారంభమైన వర్షం ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు గంటపాటు కుండపోతగా కురుస్తూనే ఉంది. నగరంలో వినాయక నిమజ్జనం సాగుతున్న సమయంలో వరుణుడు ప్రతాపం చూపించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







