మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో భద్రతా ప్రమాణాలపై అధికారుల తనిఖీ
- September 16, 2016
కువైట్ సిటీ : వివిధ మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్ లో భద్రతా ప్రమాణాలపై ప్రచారం నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోఈద్ అల్- అధా ఉత్సవాల సమయంలో ఈ తనిఖీ కార్యక్రమం ప్రారంభించింది. యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ పబ్లిక్ సెక్యూరిటీ వ్యవహారాల మేజర్ జనరల్ ఇబ్రహీం అల్ తర్రహ్ నేతృత్వంలో పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటనలో, ప్రజా సంబంధాలు మరియు సెక్యూరిటీ మీడియా శాఖ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించినట్లు ప్రచారంలో వివరించారు. తమ తనిఖీలు మార్కెట్లు , షాపింగ్ మాల్స్ మరియు వినోద మందిరాలలో శాంతిభద్రతలకి తగిన భరోసా ఉండేలా చూడటమే తమ లక్ష్యం అని తెలిపారు. రాజధానితో సహా గవర్నరేట్ల పరిధిలో హవల్లి మరియు ఫర్వాణీయలలో 360 దుకాణాలలో అవెన్యూస్ మాల్ మరియు సౌక్ షారుఖ్ ప్రధాన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించింది. అందరూ పండుగ ఉత్సాహంలో లో ఉన్నారని అయితే, ఆయా ప్రాంతాలలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా సంరక్షించుకోవాలని అధికారులకు సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







